చక్కెర ఎగుమతులకు కేంద్రం బ్రేక్

posted on: May 14, 2026 1:27PM

 

దేశీయంగా చక్కెర ధరలు సామాన్యులకు భారాన్ని పెంచకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పంచదార లభ్యతను పెంచి, పెరుగుతున్న ధరలను అదుపులోకి తీసుకురావడమే లక్ష్యంగా చక్కెర ఎగుమతులపై తక్షణమే నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.  

వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్  ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ముడి చక్కెర , తెల్ల చక్కెర, మరియు శుద్ధి చేసిన చక్కెర  వంటి అన్ని రకాల చక్కెర ఉత్పత్తులకు ఈ ఎగుమతి నిషేధం వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. విదేశాలకు పంపే చక్కెరను 'నియంత్రిత'  జాబితా నుండి 'నిషేధిత'  జాబితాలోకి మారుస్తూ తాజా నిర్ణయం తీసుకున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...