ఇస్లామాబాద్ లో ఆత్మాహుతి దాడి..50 మందికి పైగా మృతి

posted on: Feb 6, 2026 3:47PM

పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది.  శుక్రవారం (ఫిబ్రవరి 6) జుమ్మా ప్రార్థనల సమయంలో ఓ షియా మసీదు లక్ష్యంగా జరిగిన ఈ బాంబు దాడిలో 50 మందికి పైగా మరణించారు. మరో 80 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

 తర్లాయ్ కలాన్‌లోని ఖదీజతుల్ కుబ్రా మసీదు లక్ష్యంగా ఈ పేలుడు జరిగింది. శుక్రవారం ప్రార్థనల కోసం పెద్ద సంఖ్యలో జనం ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలో జరిగిన ఈ బాంబు దాడి ఆత్మాహుతి దాడి అయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.  మసీదు ప్రధాన ద్వారం  ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చుకుని ఉండొచ్చంటున్నారు.  కాగా ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకూ ఏ ఉగ్ర సంస్థా ప్రకటన విడుదల చేయలేదు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...