Latest News
టెక్కీ సక్సెస్ స్టోరీ..
posted on: Mar 14, 2026 10:45AM

ఐటీ రంగం అవకాశాల గని. కష్టపడి పని చేస్తే.. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుంటే.. స్వల్ప కాలంలోనే విజయాలు వెతుక్కుంటూ వస్తాయి. ఈ విషయం గతంలోనూ పలుమార్లు రుజువైంది. తాజాగా ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కేవలం నాలుగేళ్ల కాలంలోనే అద్భుత విజయాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ టెక్కీ కేవలం నాలుగేళ్లలోనే తన జీతాన్ని రూ.3.5 లక్షల వార్షిక ప్యాకేజీ నుంచి రూ.65 లక్షల వరకు పెంచుకున్నారు.
వివరాలిలా ఉన్నాయి. 2021లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం పొందిన ఈ టెక్కీకి ఆరంభంలో వచ్చిన యాన్యువల్ ప్యాకేజీ 3.5 లక్షల రూపాయలు. కెరీర్ లో ఎదగాలన్న లక్ష్యంతో, పట్టుదలతో, సంకల్పంతో ఆయన కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడం, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెట్టారు. అలాగే బెటర్ ఆపర్చ్యునిటీల కోసం.. గాలిస్తూ, పలు కంపెనీల ఇంటర్వ్యూలకు రెడీ అయ్యారు.
తన స్కిల్స్ ను పెంచుకోవడంతో ఆయనకు మరింత మంచి ఉద్యోగ అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి. దీంతో ఒక్కోసారి కంపెనీ మారుతూ తన జీతాన్ని క్రమంగా పెంచుకుంటూ వచ్చాడు. ఈ ప్రయాణంలో కొన్ని సందర్భాల్లో అతనికి 40 నుంచి 50 శాతం వరకు వేతన పెరుగుదల కూడా లభించింది.
చివరకు మరో ప్రముఖ ఐటీ సంస్థలో చేరిన తర్వాత అతని వార్షిక ప్యాకేజీ రూ.65 లక్షలకు చేరుకుంది. ఈ తన ప్రస్థానాన్ని ఆ టెక్కీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నెటిజన్లు ఆయన పట్టుదలను, కష్టపడి పని చేసే తత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఈ టెక్కీ విజయగాధ ఐటీ రంగంలో ఎదగాలనుకునే యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.


.webp)



