Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మెటా, గూగుల్ అప్పుల గుట్టు రట్టు! AI డేటా సెంటర్ల సబ్‌ప్రైమ్ క్రైసిస్ నిజమేనా?
posted on: Jul 24, 2026 8:30AM
(14).webp)
చేతిలో స్మార్ట్‌ఫోన్ పట్టుకుని మనం అడుగుతున్న ప్రశ్నలకు క్షణాల్లో సమాధానాలు ఇస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వెనుక ఒక భారీ ఆర్థిక ప్రమాదం పొంచి ఉందా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ ఆర్థిక విశ్లేషణ సంస్థల నివేదికలు. నేడు ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న ఏఐ విప్లవం వెనుక బిలియన్ల కొద్దీ డాలర్ల రుణాల పర్వతం పేరుకుపోతోంది. సరిగ్గా 2008 నాటి 'సబ్‌ప్రైమ్ మోర్ట్‌గేజ్' ఆర్థిక సంక్షోభాన్ని గుర్తుచేసేలా, ఇప్పుడు 'సబ్‌ప్రైమ్ డేటా సెంటర్ సంక్షోభం' గ్లోబల్ ఎకానమీని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.
బ్లూమ్‌బెర్గ్ విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం, ప్రస్తుతం ఏఐ డేటా సెంటర్ల నిర్మాణం కోసం దాదాపు 500 బిలియన్ డాలర్లకు పైగా అప్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో సుమారు 200 బిలియన్ డాలర్లు ప్రైవేట్ క్రెడిట్ ఫండ్స్ ద్వారా సేకరించబడ్డాయి. మరో వైపు నిక్కీ ఆసియా అందించిన నివేదిక ప్రకారం, మెటా, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ మరియు ఒరాకిల్ వంటి టెక్ దిగ్గజాలు గత ఐదేళ్ల కాలంలో ఏకంగా 1.65 ట్రిలియన్ డాలర్ల మేర రుణాలను పోగుచేసుకున్నాయి. అయితే అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న ప్రధాన అంశం ఏంటంటే, ఈ భారీ అప్పులలో ఎక్కువ భాగం ఆయా కంపెనీల ప్రధాన బ్యాలెన్స్ షీట్లలో కనిపించకుండా రహస్యంగా దాచిపెట్టడమే.
ఈ అప్పులను దాచడానికి టెక్ కంపెనీలు 'స్పెషల్ పర్పస్ వెహికల్స్' (SPVs) అనే ప్రత్యేక శెల్ సంస్థలను ఉపయోగిస్తున్నాయి. ఉదాహరణకు, కోర్‌వీవ్ (CoreWeave) అనే ప్రముఖ క్లౌడ్ సంస్థ మెటా కాంట్రాక్ట్‌తో అనుసంధానించి దాదాపు 8.5 బిలియన్ డాలర్ల నిధులను వేర్వేరు ఎస్‌పీవీల ద్వారా సమీకరించింది. అంతేకాకుండా, మెటా నిర్మిస్తున్న భారీ 'హైపరీయన్ డేటా సెంటర్'లో మెటా వాటా కేవలం 20 శాతం మాత్రమే. మిగిలిన 80 శాతం వాటా(Blue Owl) అనే ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ చేతిలో ఉంది. దీనివల్ల ఆర్థిక ప్రమాదం మెటా బ్యాలెన్స్ షీట్‌లో నమోదు కాకుండా బయటి ఇన్వెస్టర్ల ఖాతాల్లోకి మళ్లుతోంది. గూగుల్ కూడా ఫ్లూయిడ్‌స్టాక్, సైఫర్ మైనింగ్, టెరావుల్ఫ్ వంటి సంస్థలతో కలిసి ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రమాదకర విధానాన్ని ప్రముఖ గ్లోబల్ ఆడిటింగ్ సంస్థ 'అర్న్స్ట్ & యంగ్' (Ernst & Young) ఇప్పటికే తీవ్రంగా తప్పుపట్టింది.
ai data center debt bubble explained,global economy threat ai data centers.


.webp)
(16).webp)


