Latest News

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్!

posted on: Mar 13, 2026 9:44PM

 

తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. టీజీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. శుక్రవారం బస్ భవన్‌లో ఆర్టీసీ ఉన్నతాధికారులకు జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. అనంతరం లేబర్ కమిషనర్ కార్యాలయంలో సైతం సమ్మె నోటీసు ఇచ్చారు. ఆర్టీసీ సమ్మె తేదీపై 14 రోజుల తరువాత నిర్ణయం తీసుకుంటామని.. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్లడం ఖాయమని జేఏసీ నేతలు తేల్చి చెప్పారు.

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే చేపట్టాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని,  మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా రూ.350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలని,  పాత బకాయిలు రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని సమ్మె నోటీసులో పేర్కొన్నాయి. అలాగే  ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ట్రేడ్‌ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలని, అన్ని కేటగిరీల్లో పనిచేసే ఉద్యోగులపై అధిక పనిభారం తగ్గించాలన్న డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చాయి.

google-ad-img
    Related Sigment News
    • Loading...