మటన్ ఉడకలేదు.. పోలీసులకు షాక్ ఇచ్చిన ఫిర్యాదు!

posted on: Mar 23, 2026 9:28AM

సినిమాల ప్రభావమో?.. సోషల్ మీడియాలో వైరల్ కావాలన్న ఆరాటమో.. అదీ కాదంటే..  ప్రజలలో శృతిమించుతున్న అవేర్ నెస్సో తెలియదు కానీ.. తాజాగా అందిన ఒక ఫిర్యాదు పోలీసులను షాక్ కు గురి చేసింది. అదే సమయంలో ఫన్నీగా కూడా అనిపించింది. ఇంతకూ విషయమేంటంటే.. తాను కొన్న మటన్ సరిగ్గా ఉడకలేదంటూ.. అది అమ్మిన విక్రయదారుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  

అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సోడాల హాజీ అనే వ్యక్తి ఆదివారం (మార్చి 22) అని మటన్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాడు. మటన్‌ను కుక్కర్లో 20 సార్లు విజిల్ వచ్చేలా పెట్టినా.. అది సరిగా ఉడక లేదు. దీంతో  తనకు మటన్ అమ్మిన విక్రయదారుడుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేయాలని పట్టుబట్టాడు.

హాజీ తను వండిన వంట పాత్రతో సహా పోలీస్ స్టేషన్‌కు రావడంతో పోలీసులు షాక్ అయ్యారు. హాజీ ఫిర్యాదుపై ఎలాంటి చర్య తీసుకోవాలో పోలీసులకు అర్ధం కాక జుట్టుపీక్కున్నంత పనైంది. చివరకు సోడాలహాజీకి సర్ది చెప్పి ఇంటికి పంపించేసరికి పోలీసులకు  తల ప్రాణం తోకకు వచ్చిందట.

google-ad-img
    Related Sigment News
    • Loading...