Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హర్మూజ్ జలసంధి ఓపెన్.. ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పిన ఇరాన్
posted on: Apr 17, 2026 9:21PM
హర్మూజ్ జలసంధిని ప్రపంచ వాణిజ్యానికి ఓపెన్ చేస్తున్నట్లు ఇరాన్ కీలక ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని ఇరాన్ ప్రకటించింది. హోర్ముజ్ జలసంధిని మూసివేసే ఆలోచన తమకు లేదని ఇరాన్ విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. అంతర్జాతీయ చమురు రవాణాలో ఈ మార్గం అత్యంత ప్రాధాన్యత కలిగినదని, దీని ద్వారానే ప్రపంచంలోని మూడో వంతు ముడి చమురు సరఫరా జరుగుతుందని తెలిసిందే.
తాజాగా లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుంది. కాల్పుల విరమణ గడువు ముగిసేంత వరకూ హర్మూజ్ పూర్తిగా తెరిచే ఉంటుందని, నౌకల రాకపోకలకు ఎటువంటి అడ్డంకులూ ఉండవనీ స్పష్టం చేసింది. కాగా ఇరాన్ నిర్ణయంపై స్పందిచిన అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి ధ్యాంక్స్ చెప్పారు.
హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించిన విషయాన్ని ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్ ద్వారా ధ్రువీకరించారు. గతంలో ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తమైంది. అయితే.. ట్రంప్ బృందం జరిపిన సంప్రదింపులు సత్ఫలితాలనివ్వడంతో ఇప్పుడు నౌకల రాకపోకలకు మార్గం సుగమమైంది. లెబనాన్‌తో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఇరాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ, లెబనాన్, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నంత కాలం హర్మూజ్ జలసంధి తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వాణిజ్య నౌకల ప్రయాణానికి ఎలాంటి అడ్డంకులు ఉండవని ఆయన హామీ ఇచ్చారు. ఇరాన్ తాజా నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ముఖ్యంగా చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్ వంటి దేశాలకు పెద్ద ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతానికి యుద్ధ వాతావరణం తగ్గుముఖం పట్టడం వల్ల పశ్చిమాసియాలో శాంతి నెలకొనే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ ఈ రకమైన సానుకూల ధోరణిని కొనసాగిస్తే, భవిష్యత్తులో ఆ దేశంపై ఉన్న మరిన్ని ఆంక్షలను అమెరికా సడలించే అవకాశం ఉందన్న భావన అంతర్జాతీయంగా వ్యక్తం అవుతోంది.



.webp)


