లక్షన్నర కోట్ల పెట్టుబడితో అనకాపల్లిలో భారీ ఉక్కు పరిశ్రమ

ఆంధ్రప్రదేశ్ లో మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. లక్షన్నర కోట్ల భారీ పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లికి సమీపంలో భారీ ఉక్కుకర్మాగారం ఏర్పాటు కానుంది. ఈ ఉక్కు కర్మాగారానికి ఈ నెల 14, 15 తేదీలలో విశాఖ వేదికగా జగరనున్న సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ వేదికగా భూమి పూజ జరగనుంది. లక్షన్నర కోట్ల భారీ వ్యయంతో  ఏర్పాటు కానున్న ఈ భారీ ఉక్కుకర్నాగారాన్ని అర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్స్ ఏర్పాటు చేయనుంది. ఈ కర్మాగారానికి సంబంధించి కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు క్లియర్ అయ్యాయి.   దీంతో దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ఫీల్డ్ ఉక్కు కర్మాగారం ఏపీలో ఏర్పాటు కావడానికి మార్గం సుగమమైంది.  

కాగా  తొలి దశలో  8.2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో  ఈ ఉక్కుకర్మాగారం ఏర్పాటు కానుంది. ముందు ముందు ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని 24 మిలియన్ టన్నులకు విస్తరించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు.  అత్యాధునిక సాంకేతికతతో, పర్యావరణ హితంగా అత్యున్నత ప్రమాణాలతో ఈ ఉక్కుకర్మాగారం ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టు పనులకు అవసరమైన అన్ని అనుమతులూ వాయువేగంతో కేవలం 14 నెలల వ్యవధిలోనే లభించడం విశేషం.  ఇది చంద్రబాబు పని తీరుకు మచ్చుతునకగా, ఆయన తరచూ చెప్పే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు నిలువెత్తు ప్రత్యక్ష తార్కాణంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.    మంత్రి నారా లోకేశ్‌  గత ఏడాది ఆగస్టులోఅర్సెలర్ మిట్టల్, నిప్పన్ స్టీల్స్ ప్రతినిథులతో చర్చలు జరిపారు. ఆ తరువాత మూడు నెలలలోనే ఉక్కుకర్మాగారం కోసం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం   భూమి కేటాయించింది.  

ఆ సందర్భంగా ఆర్సెలర్ మిట్టల్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆదిత్య మిట్టల్ మాట్లాడుతూ,   కోరిన వెంటనే భూమి కేటాయించి, అనుమతులు మంజూరు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూపిన వేగం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మేం ఇక్కడ ఏర్పాటు చేయబోయేది కేవలం ఉక్కు కర్మాగారం కాదు..  ఇన్నోవేషన్స్, సస్టెయినబులిటీ, ఎంప్లాయిమెంట్ ఆపర్ట్యునిటీస్ సెంటర్ గా దీనిని తీర్చిదిద్దుతామని చెప్పారు.  

కాగా అతి తక్కువ సమయంలో ఈ ప్రాజెక్టుకు అనుమతులు రావడం ప్రభుత్వ పారదర్శకతకు, సమర్థతకు నిదర్శనంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో  ఏపీలో ప్రపంచ స్థాయి పారిశ్రామిక వ్యవస్థను అభివృద్ధి అయ్యిందనడానికి ఈ ప్లాంట్ కు సత్వరం అనుమతులు క్లియర్ అవ్వడమే నిదర్శనమంటున్నారు. ఈ ఉక్కుకర్మాగారం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu