Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు.. ఉద్దండరాయుని పాలెంలో చంద్రబాబు
posted on: Apr 2, 2026 4:20PM

పార్లమెంటు ఉభయ సభల్లోనూ అమరావతి బిల్లు కు ఆమోదం లభించడంతో అమరావతికి చట్టబద్ధత ఇక లాంఛనమే. నేడో రేపో రాష్ట్రపతి సంతకంతో ఇది చట్టరూపం దాలుస్తుంది. ఈ నేపథ్యంలో అమరావతిలో పండుగ వాతావరణం నెలకొంది. గురువారం (ఏప్రిల్ 2) సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు. ఏకైక రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకునే రోజు వచ్చిందనీ, అలాగే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటును కూడా త్వరలోనే సాకారం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇక జనసేన నాయకుడు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే బిల్లు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందడం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సాధించిన గొప్ప విజయమని కొనియాడారు. ఇక గురువారం (ఏప్రిల్ 2) సాయంత్రం జరిగే సంబరాల్లో జనసేన, బీజేపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి.






