Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...దుబాయ్ ఎయిర్ పోర్టులో సింధు.. భయంతో వణికిపోతున్నానంటూ ట్వీట్
posted on: Mar 1, 2026 6:21AM
.webp)
తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్, రెండు సార్లు ఒలింపిక్ మెడల్ విజేత పీవీ సింధు దుబాయ్ ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు బర్మింగ్‌హామ్ వెళుతున్న సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. జ్రాయెల్-అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులకు పాల్పడుతోంది.ఇరాన్ దాడులు అమెరికా దళాలకు ఆశ్రయం కల్పిస్తున్న నగరాలు లక్ష్యంగా సాగుతున్నాయి. అబుదాబిలోని అల్ దఫ్రా, దోహాలోని అల్ ఉదైద్, సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరాలు, దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్ట్ లపై ఇరాన్ దాడులకు పాల్పడింది. యూఏఈలోని అబుదాబి, దుబాయ్, ఖతార్‌లోని దోహా, సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లపై క్షిపణలతో దాడులు చేసింది.
ఈ నేపథ్యంలో యూఏఈ, దుబాయ్, టర్కీ సహా పలు దేశాలు తమ గగన తలాన్ని మూసివేశాయి. విమానాశ్రాయలాను క్లోజ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లో పాల్గొనేందుకు వెడుతున్న సింధు మార్గ మధ్యంలో దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయింది. ఈ విషయాన్ని పీవీ సింధు సోషల్ మీడియాలో చేసిన ఓ వీడియో పోస్టులో స్వయంగా తెలియజేసింది. తన కళ్ల ముందే ఆకాశంలో క్షిపణి దాడులు జరుగుతున్నాయనీ, పేలుళ్ల శబ్ధాలకు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నట్లు పేర్కొంది. పరిస్థితి ఎప్పటికి కుదుటపడుతుందో.. ఇక్కడ నుంచి ఎప్పుడు బయటపడతానో అని ఆందోళనగా ఉందని పీవీ సింధు ఆ పోస్టులో పేర్కొంది. అదే పోస్టులో తన క్షేమం కాంక్షిస్తూ మెసేజీలు చేసిన అందరికి ధన్యవాదాలు తెలిపింది.
ఇలా ఉండగా.. ఇండియన్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సింధుతో టచ్ లో ఉన్నామని పేర్కొంది. ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ కోసం మిగిలిన ఇండియన్ ప్లేయర్స్ అంతా ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకున్నారని, సింధు శనివారం బయలుదేరారనీ వివరణ ఇచ్చింది. ఈ టోర్నీ మంగళవారం (మార్చి 3) నుంచి ప్రారంభం కానుంది.






