Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బుక్స్ మోసినట్లు.. బ్యాగ్‌లోతన గుండెను మోశాడు
posted on: Jun 11, 2016 4:07PM
.jpg)
స్కూల్ స్టూడెంట్స్ బ్యాగ్‌లో బుక్స్ మోసినట్లు..ఒక వ్యక్తి తన గుండెను బ్యాగులో పెట్టుకుని మోశాడు. అమెరికాలోని మిచిగన్‌కు చెందిన 25 ఏళ్ల లార్కిన్ 16 ఏళ్ల వయసులో బాస్కెట్ బాల్ ఆడుతూ కోర్టులోనే కుప్పకూలిపోయాడు. అతనిని పరీక్షించిన వైద్యులు అతనికి గుండెకు సంబంధించిన వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఏఆర్‌వీడీగా పిలువబడే రైట్ వెంట్రిక్యూలర్ డిస్‌ప్లాసియా వ్యాధితో అతను బాధపడుతున్నట్టు గమనించారు. ఆ వ్యాధి వల్ల హార్ట్ బీట్ రెగ్యులర్‌గా ఉండదు. సడన్‌గా గుండెపోటు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. దీనికి పరిష్కారం ఆలోచించిన వైద్యులు ఆ గుండెను తొలగించి కొత్త గుండెను అమర్చాలనుకున్నారు.

అయితే సమయానికి అతనికి సరిపడిన గుండె లభించపోవడంతో ప్రాణాలు నిలబెట్టడం కోసం కృత్రిమ గుండెను బిగించారు. ఆ హార్ట్ డివైస్‌ను సింక్కార్డియా ఫ్రీడమ్ టోటల్ ఆర్టిఫిషియల్ హార్ట్ లేదా బిగ్‌బ్లూగా పిలుస్తారు. బిగ్‌బ్లూ గుండె మిషన్ గాలిని కంప్రెస్డ్ రూపంలో పంపుతుంది. రెండు ట్యూబ్‌ల ద్వారా ఎయిర్ పంపింగ్ జరుగుతుంది. రెండు గుండె కవాటాలకు ఆ రెండు పైపులను తగిలిస్తారు. అయితే వీపు వెనుకాల ఉన్న మిషన్ ద్వారా గాలి గుండెకు చేరుతుంది. అలా ఆ గుండెను లార్కిన్ ఎప్పుడూ బ్యాగ్‌లా తన వెంట తీసుకెళ్లేవాడు. దాని వల్ల అతను సాధారణ జీవితాన్ని సాగించాడు. సుమారు 13.5 పౌండ్ల బరువున్న గుండెను దాదాపు 555 రోజులు మోశాడు. అయితే గత నెలలో లార్కిన్ గుండె మార్పిడి చికిత్స చేయించుకున్నాడు. దీంతో సుమారు 17 నెలల పాటు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్లైంది. ఇప్పుడతను బాస్కెట్‌బాల్ కూడా ఆడగలడు.






