Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో తొక్కిసలాట.. పలువురు భక్తులకు గాయాలు
posted on: Mar 4, 2026 1:31PM
.webp)
నల్లగొండ జిల్లా ఆమనగల్లులో జరుగుతున్న శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. అగ్నిగుండం దాటే కార్యక్రమం సందర్భం గా జరిగిన తోపులాటలో పలువురు భక్తులు నిప్పుల గుండంలో పడి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెడితే.. సంప్రదాయంగా నిర్వహించే అగ్నిగుండం కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సమయం లో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ తోపులాటలో కొందరు భక్తులు అగ్నిగుండం లో పడిపోయారు. అక్కడే ఉన్న ఇతర భక్తులు, నిర్వా హకులు వెంటనే స్పందించి నిప్పుల్లో పడిన వారిని బయటకు లాగి రక్షించారు. ఈ ప్రమాదంలో మొత్తం 11 మందికి తీవ్ర గాయాల య్యాయి. గాయపడిన వారిని హుటా హుటిన సమీప ఆసుపత్రు లకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనతో ఉత్సవాల్లో విషాద వాతావ రణం నెలకొంది. భక్తుల భద్రత కోసం మరింత కట్టుది ట్టమైన ఏర్పాట్లు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.


.webp)
.webp)


