Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైదరాబాద్‌లో కత్తిపోట్ల కలకలం
posted on: Mar 10, 2026 7:22PM
.webp)
హైదరాబాద్‌లో కత్తిపోట్ల కలకలం చోటుచేసుకుంది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన నగరంలో కలవరాన్ని రేకెత్తించింది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లర్ నం. 1482 సమీపం లో ఉన్న వారాహి కన్సల్టెన్సీ కార్యాలయంలో పనిచే స్తున్న మేనేజర్ శశికిరణ్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో శశికిరణ్ రెడ్డి తీవ్రంగా గాయపడగా, అక్కడే ఉన్న ట్రైనర్ లయ అనే యువతి కూడా గాయా లపాలైంది.
గాయపడిన ఇద్దరినీ వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శశికిరణ్ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు గాయపడిన లయ ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.సమాచారం అందుకున్న వెంటనే బంజా రాహిల్స్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలిం చారు. దాడి చేసిన వ్యక్తి ఎవరు? దాడికి కారణాలు ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్లను కూడా పరిశీలిస్తు న్నారు.ఈ ఘటనతో మధు రానగర్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.



.webp)


