భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఆనం

posted on: Feb 13, 2026 9:13AM

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని  రాష్ట్రప్రభుత్వం తరఫున  శ్రీశైలం  శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు  దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గురువారం (ఫిబ్రవరి 12) పట్టు వస్త్రాలనుసమర్పించారు.

 శ్రీశైలం  విశిష్టమైన   శైవక్షేత్రమనీ, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ చేయడం ఆనందంగా ఉందనీ ఆనం ఈ సందర్భంగా చెప్పారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి భారీగా తరలివస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ ఎదురుకాకుండా జిల్లా యంత్రాంగం, దేవస్థానం సమన్వయంతో  పటిష్ట చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

  ఆలయ ఏర్పాట్లు, భక్తులకు అందిస్తున్న సదుపాయాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు.  ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్  రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, స్థానిక శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...