కాశీబుగ్గ మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత
posted on Nov 2, 2025 2:49PM

శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయ తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ.15లక్షల పరిహారాన్ని అందజేశారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం నుండి మరో రెండు లక్షల సాయం అందుతుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ధైర్యంగా ఉండాలని మృతుల కుటుంబాలకు కేంద్ర మంత్రి సానుభూతి తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని భరోసా కల్పించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని చెప్పారు. విజయవెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో 9మంది భక్తులు చనిపోగా 25 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే ఏకాదశి శనివారం కావడంతో వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామి ఆలయానికి 15 వేల మందికి పైగా భక్తులు ఒకేసారి దర్శనం కోసం ప్రయత్నించడంతో ఆలయంలోని రెయిలింగ్ విరిగిపోయిందని.... దీంతో ఒక్కసారిగా భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడంతో తీవ్ర తొక్కిసలాట చోటుచేసుకుంది.