Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్ పంచకు షణ్ముగం వర్గం?!
posted on: May 12, 2026 9:24AM

తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో టీవీకే ప్రభుత్వం కొలువుదీరిన తరువాత.. అన్నాడీఎంకేలో ఒక బలమైన వర్గం టీవీకే పంచన చేరడానికి రెడీ అవుతోంది. దీంతో అన్నాడీఎంకేలో చీలిక అనివార్యంగా కనిపిస్తోంది. అన్నాడీఎంకేలో చాలా కాలంగా ఉన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు ముదిరి పాకాన పడ్డాయి.
పార్టీలోని ఒక కీలక వర్గం దళపతి విజయ్ తమిళగ వెట్రి కళగం (టీవీకే) వైపు మొగ్గు చూపుతోంది. విలుప్పురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి సి.వి. షణ్ముగం, ఆయన వర్గంలోని కీలక నేతలు విజయ్ పార్టీ వైపు చూస్తున్నారన్న చర్చ తమిళనాట జోరుగా సాగుతోంది.
గత కొంతకాలంగా అన్నాడీఎంకే నాయకత్వంపై సి.వి. షణ్ముగం వర్గం తీవ్ర అసంతృప్తి ఉండటం, ఆ అసంతృప్తిని పలు సందర్భాలలో బాహాటంగానే వ్యక్తం అవ్వడం, ఇప్పుడీ చర్చకు కారణమైందని అంటున్నారు. ఇప్పటికే షణ్ముగం వర్గానికి చెందిన ప్రతినిథులు విజయ్ తో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.






