అరంగేట్రంలోనే అద్భుత సెంచరీ.. రువాండా మహిళా క్రికెటర్ రికార్డ్!

posted on: Mar 21, 2026 10:17AM

క్రికెట్ లో ఓ అనామక ప్లేయర్ రికార్డ్ సృష్టించింది. టి20 చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ను అరంగేట్రంలోనే ఆడి ఓ అద్భుతం సృష్టించింది. వివరాల్లోకి వెడితే రువాండాకు చెందిన 15 ఏళ్ల షాకిలా నియిముహోజా తన అరంగేట్రంతోనే మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకుంది.  మలేసియా వేదికగా జరుగుతున్న టి20 క్వార్టర్ సిరీస్ లో రువాండా, మలేసియా మధ్య జరిగిన మ్యాచ్ లో షాకిలా నియిముహోజా కేవలం 63 బంతుల్లోనే 11 ఫోర్లు, ఒక సిక్సర్ తో అజేయంగా 104 పరుగులు చేసింది.

కేవలం 15 ఏళ్ల వయస్సులోనే ఇంటర్నేషనల్ క్రికెట్ లో మెరుపు సెంచరీ చేసిన విమెన్ బ్యాటర్ గా రికార్డు సృష్టించింది.  అలాగే తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేసిన మహిళా క్రికెటర్ గా రికార్డు సాధించింది.  అయితే మహిళా క్రికెట్ లో తొలి మ్యాచ్ లోనే సెంచరీ చేసిన రికార్డు గతంలో ఖతార్ కు చెందిన షాహ్రీన్ బహదూర్ పేరిట ఉన్న రికార్డును షాకిలా సమం చేసింది. ఆ క్రమంలో అతి పిన్న వయస్సులోనే ఈ ఘనత సాధించిన తొలి విమెన్ బ్యాటర్ గా రికార్డు నెలకొల్పింది.  ఇక మ్యాచ్ విషయానికి వస్తే..

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన రువాండా.. షాకీల మెరుపు ఇన్నింగ్స్ ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గ్రౌండ్ నలుమూలల షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. అనంతరం 168 పరుగుల విజయ లక్ష్యంతో  బరిలోకి దిగిన మలేషియా జట్టు కేవలం 88 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది.

ప్రస్తుతం రువాండా మహిళా క్రికెట్ జట్టు అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతున్న క్రమంలో, ఇలాంటి యువ ప్రతిభ బయటకు రావడం ఆ దేశ క్రికెట్ భవిష్యత్తుకు శుభసూచకమని చెప్పవచ్చు. షాకిలా నియిముహోజా పై క్రికెట్ అభిమానులు  సామాజిక మాధ్యమం వేదికగా ప్రశంసలు గుప్పిస్తున్నారు. భవిష్యత్ లో ఆమె స్టార్ మహిళా క్రికెటర్ గా ఎదగడం ఖాయమంటున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...