Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పది ముక్కల్లో ప్రత్యేక హోదా గురించి...
posted on: Sep 7, 2016 3:24PM

ఇప్పుడు ఎక్కడ విన్నా ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్, ప్రత్యేక ప్రకటన... ఇవే మాటలు వినిపిస్తున్నాయి! అసలింతకీ ఇవ్వాల్సిందేనని ఆంధ్ర నేతలు పట్టుబడుతోన్నా, ఇవ్వటం కుదరదని కేంద్రం నేతలు చెప్పకనే చెబుతోన్నా... ప్రత్యేక హోదా అంటే ఏంటి? రండి చూసేద్దాం సింపుల్ గా...
1. ప్రత్యేక హోదా అంటే ఆర్దికంగా వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్రం ప్రత్యేక సాయం అందించటం. గ్రాంట్లు, పన్నుల మినహాయింపు లాంటి నిర్ణయాలతో ఆయా రాష్ట్రాలకు పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగాల కల్పన జరిగేలా చూడటం.
2. ప్రత్యేక హోదా కొన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని 1969లో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 11రాష్ట్రాలు ప్రత్యేక హోదా కలిగి వున్నాయి.
3. ప్రత్యేక హోదా రావాలంటే ప్రదానమంత్రి, కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు సభ్యులుగా వుండే జాతీయ అభివృద్ధి మండలి ఒప్పుకోవాలి.
4. ప్రత్యేక హోదా పొందే రాష్ట్రాలకు వుండాల్సిన అర్హతలు... కొండ ప్రాంతాలు, తక్కువ జనసాంద్రత, ఇతర దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు కలిగి వుండటం, ఆర్దిక, మౌలిక సదుపాయాలు లేక వెనుకబడటం, ఆర్దికంగా స్థిరమైన వనరులు లేకపోవటం
5. సమైక్యాంధ్ర విభజనతో హైద్రాబాద్ ను కోల్పోయిన నవ్యాంధ్ర తీవ్రమైన ఆర్దిక లోటులో వుంది. దాన్ని ఎదుర్కొని నిలబడటానికి ప్రత్యేక హోదా తప్పనిసరి.
6. ప్రత్యేక హోదా రావటం వల్ల ఏపీకి అనేక విధాలుగా లాభపడుతుంది. ముఖ్యంగా, పన్నుల మినహాయింపు వల్ల వేలాది పరిశ్రమలు రాష్ట్రానికి తరలి వస్తాయి.
7. ప్రత్యేక హోదా కారణంగా పరిశ్రమలు వస్తే వాటితో పాటూ వేలాది ఉద్యోగాలు కూడా వస్తాయి. దీని వల్ల నేరుగా ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు లబ్ది చేకూరుతుంది!
8. ప్రత్యేక హోదా వస్తే వివిధ రకాల పథకాల్లో కేంద్రం 90శాతం భారం భరిస్తుంది. పోలవరం లాంటి ప్రాజెక్ట్ కూడా దాదాపుగా కేంద్ర నిధులతోనే పూర్తవుతుంది.
9. ప్రత్యేక హోదా వస్తే 100శాతం ఎక్సైజ్ డ్యూటీ, 100శాతం ఇన్ కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వుంటుంది.
10. కేంద్రం ఇచ్చే ప్రాత్సాహకాల వల్ల రాష్ట్రానికి వచ్చే కరెంట్ కూడా సగం ధరకే లభిస్తుంది!






