Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వైసీపీలో నిజం మాట్లాడితే నిష్ఠూరమే.!
posted on: Jul 15, 2026 12:38PM

రాయలసీమ ప్రాంత అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడే హాట్ టాపిక్కే.. ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చుట్టూ జరిగే రాజకీయాలు ఎప్పటికప్పుడు కొత్త కొత్త మలుపులు తిరుగుతుంటాయి. వైసీపీ హయాంలో దాదాపు 3 వేల 850 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు కేటాయించిన నీటిని పూర్తిగా వినియోగించుకోవడమే లక్ష్యంగా ఈ పథకానికి అంకురార్పణ జరిగింది. అయితే.. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి ఈ కీలక ప్రాజెక్టును పక్కన పెట్టేసిందని వైసీపీ ఇప్పుడు ఆరోపణలు గుప్పిస్తోంది.
తెలుగుదేశం కూటమి సర్కార్ తీరు వవల్ల సీమకు 101 టీఎంసీల నీరు అందకుండా పోతోందని వైసీపీ నిప్పులు చెరుగుతోంది. అయితే వైసీపీ వాదన, విమర్శలలోని డొల్ల తనాన్ని ఆ పార్టీకే చెందిన ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఇటీవల జరిగిన వైసీపీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో విశ్వేశ్వరరెడ్డి.. సీమ జల ప్రయోజనాల రక్షణ విషయంలో చేయాల్సినదేమిటన్న విషయంపై నిష్కర్షగా మాట్లాడారు.
ఐదేళ్ల జగన్ పాలనలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని.. ప్రస్తుత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, జల సంరక్షణ చర్యలను పోలుస్తూ విపులంగా మాట్లాడారు. అయితే విశ్వేశ్వరరెడ్డి సొంత పార్టీ సమావేశంలో నిజాలను చెప్పడం ఆ పార్టీ అధినాయకత్వానికి నిషూరమైంది. అంతే వెంటనే తెలుగుదేశంతో కుమ్మక్కు అంటూ కథలల్లేయడం మొదలెట్టింది వైసీపీ. ఈ నేపథ్యంలో గత్యంతరం లేని పరిస్థితుల్లో విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ..విశ్వేశ్వరరెడ్డి.. తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందంటూ చెప్పుకొచ్చారు. తాము రాయలసీమ ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నామని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతుందని చెప్పారు.
అయితే ఆ సందర్భంగా ఆయన హావభావాలు, బాడీ లాంగ్వేజ్ చూసిన ఎవరైనా ఆయన చేత బలవంతంగా అలా చెప్పించారన్న అభిప్రాయానికే వస్తారు. అందుకే ఆయన ఎంత వివరణ ఇచ్చినా ఎవరూ నమ్మడం లేదు. సీమ ప్రయోజనాలకు విరుద్ధంగా జగన్ పాలన జరిగిందని.. స్వయంగా వైసీపీ సీనియర్ నేతే అంతర్గత సమావేశంలో చెప్పడం అధికార తెలుగుదేశం కూటమికి తమ వాదన మరింత బలంగా వినిపించే అవకాశం ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు వేదికగా జగన్ హయాంలో ప్రవేశపెట్టిన బడ్జెట్లలో రాయలసీమ నీటి ప్రాజెక్టులకు అరకొర కేటాయింపులు చేసి, అందులో కనీసం 40 శాతం నిధులు కూడా ఖర్చు చేయకుండా నీటి వనరుల శాఖను నిర్వీర్యం చేశారని గణాంకాలతో సహా వివరించారు. అసలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును గ్రీన్ ట్రైబ్యునల్ ఆపివేసింది జగన్ పాలనలోనే కదా అని ప్రశ్నించారు. మొత్తం మీద జగన్ హయాంలో సీమ ప్రయోజనాలకు భంగం వాటిల్లిందనీ, జగన్ విధానాలే అందుకు కారణమన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది.
ysrcp internal rift, y visweswara reddy, rayalaseema lift irrigation scheme






