అందుకే జగన్ అసెంబ్లీ రావడం లేదు : స్పీకర్ అయ్యన్న
posted on Nov 10, 2025 6:02PM

వైసీపీ అధినే జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. వైసీపీ శాసన సభ్యులు అసెంబ్లీకి రాకపోవడంపై సభాపతి స్పందించారు. జగన్‌కు సాధారణ ఎమ్మెల్యేకు ఇచ్చిన సమయమే ఇస్తామని స్ఫష్టం చేశారు. ఆయన మీడియా ముందు కాకుండా అసెంబ్లీ కొచ్చి మాట్లాడాలని హితవు పలికారు.
నా ముందు అధ్యక్ష అనడం ఇష్టం లేక అసెంబ్లీకి రావడం లేదని తెలిపారు. వైసీపీ 10 మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు జగన్ తప్ప.. కానీ అసెంబ్లీకి మాత్రం రావడం లేదని స్పీకర్ తెలిపారు. గత జగన్ హయాంలో ఏపీ సర్వనాశనమైందని తెలిపారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తిలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో 41 రోజుల పాటు నిర్వహిస్తున్న మహాకోటి బిల్వార్చన, కోటి కుంకుమార్చన, రుద్రయాగ, చంఢీయాగ, నవగ్రహ యాగాల్లో సభాపతి అయ్యన్న సోమవారం పాల్గొన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని కాపాడారని. రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు చిత్తశుద్ధిగా పని చేస్తుంటే వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.