Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీకి స్పేస్ ఉందా?
posted on: Jun 20, 2026 2:37PM
.webp)
తెలంగాణ ప్రస్తుత రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే ఒక చిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా చలామణి అవుతున్న శక్తుల మధ్య స్పష్టమైన పొలిటటికల్ వాక్యూమ్ ఏర్పడిందని అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీకి, కాదంటే.. బలమైన ప్రత్యామ్నాయ కూటమికి అవకాశాలు ఉన్నాయా? అన్నచర్చ రాష్ట్రరాజకీయాలలో జోరుగా
సాగుతోంది.
దేశవ్యాప్తంగా లేదా ఇతర రాష్ట్రాల్లో ఒక పార్టీ బలహీనపడితే మరో పార్టీ పుంజుకోవడం సాధారణం.. కానీ తెలంగాణలో అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం రెండింటిపైనా ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవున్న పరిస్థితి. ఇక ఈ రెండూ కాకుండా బీజేపీ కూడా తెలంగాణ రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నట్లుకనిసిస్తున్నప్పటికీ ఆ పార్టీ పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తున్నది. హైదరాబాద్మినహాయిస్తే.. బీజేపీ పరిస్థితి ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది. దీంతో ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
ప్రస్తుతం తెలంగాణను పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తరహా కేంద్రీకృత పాలనకు భిన్నమైన పరిపాలనను అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఆచరణలో ఆ మార్పులు పెద్దగా కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ మౌలిక ప్రయోజనాలను, కీలక ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల వల్ల తెలంగాణ సమాజంలోని మేధావులు, ఉద్యమకారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
మరోవైపు, పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్ పరిస్థితి కూడా ఎంతమాత్రం ఆశాజనకంగా లేదు. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ పార్టీ నాయకత్వం తమ తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం లేదనే అసంతృప్తి పార్టీ శ్రేణుల్లోనే కనిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ పగ్గాలు కేటీఆర్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత క్షేత్రస్థాయి రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. కేటీఆర్ శైలి తెలంగాణ సంస్కృతికి, ఇక్కడి మట్టి మనుషుల ఆలోచనలకు దూరంగా కార్పొరేట్ తరహాలో ఉంటోందనే విమర్శలు బీఆర్ఎస్ శ్రేణుల నుంచే వస్తున్నాయి4. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కేసీఆర్ కుమార్తె కవిత సొంతంగా తెలంగాణ రక్షణ సేన ఏర్పాటు చేశారు. అయితే ఆమే ముందుకు సాగడానికి పాత నీడలు, వివాదాలు ఆమెను వెన్నాడుతున్నాయి. ఆమె జోరుకు ఇవిసహజంగానే అవరోధాలుగా ఉన్నాయి. దీంతో టీఆర్ఎస్, బీఆర్‌ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదిగే విషయంలో వెనుకబడుతోంది.
ఈ వ్యూహాత్మక రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో జరిగిన కొన్ని చారిత్రక ప్రయోగాలను మేధావులు గుర్తుచేస్తున్నారు. గతంలో దళిత, వెనుకబడిన వర్గాల హక్కుల కోసం ఏర్పాటైన 'మహాజన ఫ్రంట్' తరహా ప్రయోగం ప్రస్తుత తెలంగాణలో అత్యంత ఆవశ్యకమని భావిస్తున్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మరియు మైనారిటీ వర్గాలను ఒకే తాటిపైకి తెచ్చి, మహిళా లోకాన్ని భాగస్వామ్యం చేస్తూ ఒక బహుజన ఫ్రంట్ లేదా విస్తృత సామాజిక వేదికను ఏర్పాటు చేయడానికి తెలంగాణలో స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి. గతంలో ఇలాంటి ప్రయోగాలు ఎన్నికల వేళ సీట్ల సర్దుబాట్లు, సరైన వ్యూహం లేకపోవడం వల్ల ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయినప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఇది ఒక చక్కని వేదిక కాగలదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేవలం రాజకీయ అధికారమే పరమావధిగా కాకుండా, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సమానత్వం కోసం ఒక పటిష్టమైన ఎజెండాతో ప్రజా క్షేత్రంలోకి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు. ఈ అనుకూల సమయాన్ని సామాజిక శక్తులు సరిగ్గా ఉపయోగించుకోకపోతే, తెలంగాణ రాజకీయాలు మరింత దిగజారే ప్రమాదం ఉందనడంలో సందేహం లేదు.






