Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
posted on: Jun 4, 2026 2:52PM
.webp)
నైరుతీ రుతుపవనాలు గురువారం (జూన్ 4) కేరళ రాష్ట్రాన్ని తాకాయి. ఈ ప్రభావంతో కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆ ప్రభావంతో కర్ణాటక, తమిళనాడులలో కూడా వాతావరణం చల్లబడింది. రెండు రాష్ట్రాలలో మేఘాలు కమ్ముకున్నాయి. గురువారం (జూన్ 4) ఈ రెండు రాష్టరాలలో కూడా భారీ వర్షాలు కురిశాయి. నైరుతీ రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయనీ.. అవి అరేబియా సముద్రం, తమిళనాడు, కేరళ, లక్షద్వీప్, బంగాళాఖాతం అంతటా విస్తరించాయనీ వాతావరణ శాఖ పేర్కొంది.
నైరుతి కదలిక కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా వాతావరణం చల్లబడుతుందని ఐఎండీ పేర్కొంది. ఇప్పటికే తెలంగాణ, రాయలసీమపై ద్రోణి విస్తరించడంతో ఇప్పటికే ఆయా ప్రాంతాలలో ఆకాశం మేఘావృతమైంది. ఇక పోతే అరేబియా సముద్రంలో తుపాను వలయం ఏర్పడింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం గురువారం (జూన్ 4) సాయంత్రం నుంచి ఈ నెల 9 వరకూ తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఇక ఏపీలో ఈ నెల 7 వరకూ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.






