వాతావరణ శాఖ చల్లటి కబురు.. నైరుతి వచ్చేస్తోంది!

posted on: May 14, 2026 5:53PM

వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే భారత్ ను తాకనున్నాయి. మండే ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు నైరుతి రుతుపవనాల రాక గురించి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.  ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయం కంటే ముందే అండమాన్ తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ పరిస్థితులు రుతుపవనాల రాకకు సానుకూలంగా మారడంతో ఈ వారం చివరి నాటికి ఇవి అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని  తెలిపింది. శనివారం ( మే 16) నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ ను చేరుకుంటాయని పేర్కొంది. . ప్రస్తుతం  నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం కేంద్రీకృతమై  ఉన్న అప్పపీడనానికి అనుబంధంగా  సముద్ర మట్టానికి   4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందనీ, రానున్న 48 గంటల్లో ఇది బలపడి..   రుతుపవనాల కదలికకు దోహదపడుతుందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. 

సాధారణంగా అండమాన్ దీవులకు రుతుపవనాలు మే 22 నాటికి చేరుకుంటాయి. అయితే ఈసారి పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో దాదాపు   6 రోజుల ముందే ఇవి ప్రవేశించే అవకాశాలున్నాయి.   అండమాన్ నికోబార్ తీరానికి చేరుకున్న రుతుపవనాలు అక్కడ నుంచి కేరళ తీరాన్ని తాకుతాయి.   

google-ad-img
    Related Sigment News
    • Loading...