Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాబడిలో దేశంలోనే నంబర్ వన్ విశాఖ రైల్వే జోన్.!
posted on: Aug 7, 2026 6:02PM

పారిశ్రామిక, రవాణా రంగాల లోనే కాకుండా భారతీయ రైల్వే చరిత్రలోనూ విశాఖపట్నం రికార్డు సృష్టించింది. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ సరికొత్త చరిత్ర సృస్టించింది. అతి స్వల్ప కాలంలోనే విశాఖ రైల్వే జోన్ రికార్డు స్థాయి రాబడి సాధించింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ వార్షికంగా 2వేల 493 కోట్ల నికర రాబడిని సాధించడం ద్వారా దేశంలోనే అత్యుత్తమ రైల్వే జోన్‌గా నిలిచింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటనలో అధికారికంగాప్రకటించింది. సుదీర్ఘకాల నిరీక్షణ తర్వాత ఏర్పాటైన విశాఖ జోన్, ఇప్పుడు దేశంలోని ఇతర పాత రైల్వే జోన్లకు గట్టి పోటీఇవ్వడమే కాకుండా రాబడిలో వాటిని అధిగమించే స్థాయికి చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్రం భారీగా నిధులను వెచ్చిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 54 వేల కోట్ల విలువైన వివిధ రైల్వే ఆధునీకరణ, లైన్ల విస్తరణ, కొత్త ప్రాజెక్టుల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఇది మాత్రమే కాకుండా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 71 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన పలు భారీ రైల్వే ప్రాజెక్టులు ప్రతిపాదనలో ఉన్నాయి. వీటితో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కోటీ పాతిక 25 లక్షల కోట్లకు పైగా రైల్వే పెట్టుబడులు ప్రవాహంలా రానున్నాయి.
మౌలిక వసతుల కల్పనలో భాగంగా విశాఖ ప్రధాన రైల్వే యార్డ్ విస్తరణ, ఆధునీకరణ పనులకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ యార్డ్ ఆధునీకరణ కోసం రైల్వే శాఖ 300 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రయాణికుల రద్దీని తట్టుకోవడం, రైళ్ల రాకపోకలను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు కింద 6 కొత్త ప్లాట్‌ఫామ్‌లను నిర్మిస్తున్నారు. ఈ కొత్త ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులోకి వస్తే విశాఖ స్టేషన్ నుండి దూరప్రాంత సర్వీసులను మరిన్ని ప్రారంభించేందుకు మార్గం సుగమం అవుతుంది. అలాగే సరుకు రవాణా సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ఈ యార్డ్ ఆధునీకరణ ఎంతగానో దోహదపడనుంది.
రైల్వే కనెక్టివిటీ, సరుకు రవాణా సులభతరం చేసేందుకు ప్రధాన మార్గాల్లో ట్రాక్‌ల విస్తరణ పనులను వేగవంతం చేశారు. అందులో భాగంగా గుంతకల్ - బళ్లారి మార్గంలో నాలుగు లైన్ల విస్తరణ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఈ లైన్ విస్తరణ వల్ల పరిశ్రమలకు బొగ్గు, ఇనుప ఖనిజం తదితర సరుకుల రవాణా వేగంగా సాగడమే కాకుండా, ప్యాసింజర్ రైళ్ల సమయపాలన గణనీయంగా మెరుగుపడుతుంది.
South Coast Railway Visakhapatnam Zone, Visakhapatnam Railway Revenue Record, AP Railway Projects2026, Visakhapatnam Railway Yard Modernization, TeluguOne


.webp)



