Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సోనియా, రాహుల్ తల్లీకొడుకులు కాదా?
posted on: Apr 9, 2014 1:19PM
.jpg)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తల్లీకొడుకులు కాదా? ఈ సందేహాన్ని వ్యక్తం చేస్తోంది ఎవరో కాదు.. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు! కొడుకును ప్రధానమంత్రి చేయడానికి రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కూడా సిద్ధమైన సోనియాగాంధీ రాహుల్ గాంధీకి తల్లి అవునా కాదా అనే సందేహం ఎందుకొచ్చిందో తెలుసుకోవాలంటే కొంత డెప్త్ లోకి వెళ్ళాల్సిన అవసరం వుంది.
సోమవారం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోని 111 స్థానాలకు అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితా చూసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు చాలామంది షాకైపోయారు. ఎందుకంటే, లిస్టులో వాళ్ళ పేర్లయితే వున్నాయిగానీ, వివిధ స్థానాల నుంచి పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతున్న వాళ్ళ పుత్రరత్నాలకు మాత్రం టిక్కెట్లు దక్కలేదు. ఇక టిక్కెట్లు వచ్చేస్తాయ్.. పోటీ చేసి గెలిచేద్దాం అని ఎదురుచూసిన సీనియర్ నాయకులు, పుత్రరత్నాలు జాయింట్‌గా బిత్తరపోయారు.
ఎందుకిలా? అని అధిష్ఠానాన్ని అడిగితే ‘ఇంటికి ఒక్కటే టిక్కెట్’ అని బ్లంట్‌గా చెప్పేసింది. దాంతో వాళ్ళకి భోరున ఏడవటం ఒక్కటే తక్కువైంది. మా పుత్రరత్నాలకు టిక్కట్లు ఇవ్వలేదు. వారసులకు, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వమని చెబుతున్నారు. మరి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తల్లీ కొడుకులే కదా.. వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో వుండే ఒకే కుటుంబానికి చెందినవాళ్ళే కదా.. మరి వాళ్ళిద్దరికీ పార్టీ టిక్కెట్లు ఎందుకు ఇచ్చిందో అని అమాయకంగా అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు తల్లీకొడుకులు కాదేమోనని ఆగ్రహంగా అంటున్నారు. వాళ్ళకి వర్తించని రూల్స్ మాకెందుకు వర్తించాయో అనుకుంటున్నారు!


.jpg)
.jpg)


