సోనియా, రాహుల్ అప్పు గొడవ!

 

 

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాయబరేలి నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలు కూడా వెల్లడించారు. వెరైటీ ఏంటంటే సోనియా గాంధీ తన కొడుకు రాహుల్ గాంధీకి 10 లక్షలు అప్పుగా ఇచ్చినట్టు డిక్లరేషన్‌లో తెలిపారు. ఇది చూసి దేశం మొత్తం తెల్లబోయింది. డిక్లరేషన్‌లో సోనియా చూపించిన ఆస్తులే మరీ వెటకారంగా వుంటే, తన కొడుకు రాహుల్ గాంధీకి డబ్బులు అప్పు ఇచ్చానని చెప్పడం మరింత వెటకారంగా వుందని అందరూ అంటున్నారు. ఇలాంటి మూమెంట్లో రాహుల్ గాంధీకి సోనియా గాంధీ ఫోన్ చేసి అప్పు తీర్చమంటే ఎలా వుంటుంది?

 


రాహుల్: హలో.. రాహుల్ హియర్.


సోనియా: రేయ్.. నేనురా మీ అమ్మని.


రాహుల్: నంబర్ చూశాలే మమ్మీ.. ఎందుకు ఫోన్ చేశావో చెప్పు.


సోనియా: అదేరా, నీకు నేను పది లక్షలు అప్పిచ్చా కదా.. వాటిని ఎప్పుడు తీరుస్తావ్?


రాహుల్: తల్లి  కొడుక్కి అప్పు ఇవ్వడమే కామెడీ అంటే.. దాన్ని తీర్చమని అడగడం అంతకన్నా కామెడీ..


సోనియా: అది కాదురా.. ఎలక్షన్ డిక్లరేషన్‌లో నీకు తొమ్మిది లక్షలు అప్పిచ్చినట్టు రాశా. ఆ అప్పు తిరిగి తీసుకున్నట్టు కూడా లెక్కల్లో వుండాలి. అంచేత నా బాకీ ఎప్పుడు తీరుస్తావో చెప్పు. అయినా పది లక్షలు అప్పుగా తీసుకుని ఏం చేశావురా?


రాహుల్: మరీ అంత గుచ్చి గుచ్చి అడక్కమ్మా.. యూత్‌కి బోలెడన్ని ఖర్చులుంటాయ్.


సోనియా: నలభై ఏళ్ళు దాటిన ముదురు బెండకాయవి. నువ్వు యూత్ ఏంట్రా? నా డబ్బు ఎప్పుడిస్తావో చెప్పు.


రాహుల్: సీరియస్‌గా అడుగుతున్నావా మమ్మీ?


సోనియా: సీరియస్‌గా మాత్రమే కాదు.. అప్పు తీర్చేవరకూ సీరియల్‌గా అడుగుతూనే వుంటా.


రాహుల్: ఇంత సీరియస్‌గా అడుగుతున్నావు కాబట్టి. ఈ ఎలక్షన్లు అయ్యాక ఇచ్చేస్తా.


సోనియా: ఎలక్షన్లయ్యాక నీకు డబ్బెక్కణ్ణించి వస్తుందో?


రాహుల్: నేనెలాగూ ప్రైమ్ మినిస్టర్ అవుతా కదా. ఎంపీ జీతం, ప్రైమ్ మినిస్టర్ జీతం పొదుపు చేసి నీ అప్పు తీర్చేస్తా. ఓకేనా?


సోనియా: నీ మొహం తీరుస్తావ్.. దేశమంతా మోడీ గాలి వీస్తోంది. అంచేత నువ్వు ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడవ్వాలి.. నా బాకీ ఎప్పుడు తీర్చాలి.. అంతా నా ఖర్మ.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu