Latest News

సోనియా గాంధీకి అస్వస్థత

posted on: Mar 25, 2026 11:29AM

కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె  ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.   ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందనీ, వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

వాతావరణ మార్పుల కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో పాటు ఛాతీలో అసౌకర్యంగా అనిపించడంతో  మంగళవారం (మార్చి 24) సాయంత్రం ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.  

సోనియా గాంధీ వెంట ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. ప్రత్యేక వైద్య బృందం సోనియా ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.   సోనియా గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో కూడా ఆమె ఇదే సమస్యతో గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స పొందారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...