Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్.!
posted on: Jul 18, 2026 8:54AM

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా గత 20 రోజులుగా సాగుతున్న పర్యావరణ, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను పోలీసులు శనివారం (జులై 18) భగ్నం చేశారు. తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో పోలీసులు ఆయనను బలవంతంగా అరెస్టు చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో 59 ఏళ్ల వాంగ్‌చుక్ నిరవధిక నిరశన చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన దీక్షకు రోజు రోజుకూ మద్దతు పెరుగుతున్నది. అయితే, శనివారం (జులై 18) తెల్లవారుజామున ఢిల్లీ పోలీసులు ఒక్కసారిగా వాంగ్‌చుక్‌ను బలవంతంగా దీక్షా శిబిరం నుండి తరలించి అరెస్ట్ చేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంపై ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు. ఈ నిరశన దీక్ష కారణంగా సోనమ్ వాంగ్‌చుక్ 8 కేజీల బరువు తగ్గారు. శుక్రవారం(జులై 17) ఆయనను పరీక్షించిన వైద్య బృందం వాంగ్‌చుక్ శరీరంలోని ముఖ్యమైన అవయవాలు విఫలమయ్యే ప్రమాదం ఉందని నివేదిక ఇచ్చింది. అంతకుముందే ఢిల్లీ హైకోర్టులో ఈ విషయమై విచారణ జరిగింది. దేశంలో ఏ పౌరుడి ప్రాణమైనా అత్యంత విలువైందని పేర్కొన్న ఢిల్లీ హైకోర్టు వాంగ్‌చుక్ ప్రాణాలను కాపాడటానికి అవసరమైన అన్ని రకాల వైద్య చర్యలు తీసుకోవాలని, అలాగే ఆయన ఆరోగ్య స్థితిపై రోజువారీ నివేదికలను సేకరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
వైద్యుల హెచ్చరికలు, కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. కాగా.. గత రెండు రోజులుగా వాంగ్‌చుక్ ఆరోగ్యం షమిస్తున్న తరుణంలో దేశంలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు సంఘీభావం తెలపడానికి పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా, సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వంటి ప్రముఖులు దీక్షా శిబిరానికి వచ్చి ఆయనను పరామర్శించారు. ఆయన పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటిస్తూనే, ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి దీక్షను విరమించాలని కోరారు.
Delhi Jantar Mantar Protest, NEET Paper Leak Controversy, Sonam Wangchuk Hunger Strike, Dharmendra Pradhan Resignation Demand






