సోలార్ ప్రాజెక్ట్ మోసం కేసులో ఈడీ చార్జిషీట్

 

ఎస్‌బీఐ బ్యాంకును మోసం చేసిన పృధ్వి సోలార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  కీలక చర్యలు చేపట్టింది. సంస్థతో పాటు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బైర్రాజు శ్రీనివాస రాజుపై ఈడీ తాజాగా చార్జిషీట్‌ దాఖలు చేసింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో పృధ్వి సోలార్ ప్రాజెక్ట్స్ సంస్థ 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు పేరుతో ఎస్‌బీఐ నుంచి ₹4.5 కోట్లు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం పొందింది. ఇందుకోసం కంపెనీ అకౌంట్లలో ₹30.5 కోట్ల తప్పుడు లాభాలు ఉన్నట్లుగా చూపించి వివరాలను తారుమారు చేశారు. 

ఈ తప్పుడు వివరాల ఆధారంగా ఎస్‌బీఐ ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం మంజూరు చేసింది.అయితే, ఆ నిధులను ఉద్దేశించిన పనులకు వినియోగించకుండా శ్రీనివాస రాజు తన సోదరి ఖాతాలకు మళ్లించి... అనంతరం ఆ నగదును విత్‌డ్రా చేసుకు న్నట్లుగా ఈడీ విచారణలో తేలింది. 

ఎస్బిఐ ఇచ్చే ఓవర్ డ్రాప్ట్ సౌకర్యాన్ని పొందేం దుకు తప్పుడు లాభాలు చూపారని గతంలో  ఎసీబీ, సీబీఐ కేసులు నమోదు చేసుకొని విచారణ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులను ఆధారంగా చేసుకుని మనీలాండరింగ్ కోణంలో ఈడి మరో కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. గతంలోనే ఈడీ శ్రీనివాస రాజుకు చెందిన ₹3.81 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసింది. ఇప్పుడుతాజాగా దర్యాప్తు పూర్తి చేసిన ఈడీ, పృధ్వి సోలార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు సంస్థ ఎండీ బైర్రాజు శ్రీనివాస రాజుపై చార్జిషీట్ దాఖలు చేసింది.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu