ఏపీలో సోషల్ మీడియా బ్యాన్‌పై లోకేశ్ కీలక వ్యాఖ్యలు

posted on: Jan 23, 2026 4:11PM

 

ఏపీలో సోషల్ మీడియా బ్యాన్ పై స్టడీ చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వినియోగించడం నిషేధం ఉందని.. అలాగే మేము కూడా ఏపీలో అమలు చేసేందుకు అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. ఒక నిర్దిష్ట వయస్సుకంటే తక్కువ ఉన్నవారు ఇలాంటి ప్లాట్‌ఫామ్లో ఉండకూడదు. వారు బహిర్గతం చేసే కంటెంట్‌ను పూర్తిగా అర్థం చేసుకోలేరని లోకేశ్ పేర్కొన్నారు.

 దేశంలో సోషల్ మీడియా ఎంత వేగంగా విస్తరిస్తోందో అందరికీ తెలిసిందే. మంచికి కూడా, హానికి కూడా ఇదే మాధ్యమం మారింది. ఒకవైపు అవగాహన పెంచుతుంటే… మరోవైపు దుష్ప్రభావాలకు కూడా కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో సోషల్ మీడియాను బ్యాన్  చేయాలన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఒక రాష్ట్రంలో సోషల్ మీడియాపై నిషేధం ప్రకటించగానే అక్కడ తీవ్ర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 

దీంతో సోషల్ మీడియా బ్యాన్‌పై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా యువత మాత్రం “సోషల్ మీడియా ఉండాల్సిందే” అని స్పష్టంగా చెబుతోంది. మరోవైపు పెద్ద వయసు వారు మాత్రం సోషల్ మీడియా కంటెంట్‌పై కఠిన నిబంధనలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే చిన్న పిల్లల విషయంలో మాత్రం అన్ని వర్గాల నుంచీ ఒకే మాట వినిపిస్తోంది. “పిల్లలకు సోషల్ మీడియాపై కచ్చితమైన నియంత్రణ లేదా నిషేధం అవసరం” అని అంటున్నారు

google-ad-img
    Related Sigment News
    • Loading...