Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యూకేలో పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!
posted on: Jun 15, 2026 4:34PM

యూకేలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా నిషేధం విధిస్తామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. ఈ ఏడాది చివరికి చట్టాన్ని రూపొందించి, వచ్చే ఏడాది మార్చి నాటికి అమల్లోకి తెస్తామని తాజాగా స్పష్టం చేశారు. పూర్తిస్థాయి నిషేధం అమలు కష్టమేనని, టెక్ కంపెనీ ఒత్తిడిని ప్రతిఘటించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనల పూర్తిస్థాయి అమలుకు తాను సిద్ధమేనని పేర్కొన్నారు. పిల్లల భద్రత, ఆనందం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
పిల్లలకు ఆన్‌లైన్ ప్రపంచం నుంచి రక్షణ కల్పించడమే ప్రస్తుత సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ అన్నారు. ఆస్ట్రేలియాలో ఇప్పటికే ఈ తరహా నిషేధం అమలవుతోంది. సోషల్ మీడియాపై ఆంక్షలకు ఇండోనేషియా కూడా సిద్ధమైంది. పిల్లల సోషల్ మీడియా వినియోగానికి సంబంధించి బ్రెజిల్‌లో ఇప్పటికే పలు రకాల ఆంక్షలు అమల్లో ఉన్నాయి. పిల్లలకు సోషల్ మీడియా నిషేధానికి ఫ్రాన్స్ కూడా సిద్ధమైంది. తుర్కియేలో చర్యలు తుదిదశలో ఉన్నాయి. ఇతర పాశ్చాత్య దేశాలు కూడా ఇదే బాటలో అడుగులు వేస్తున్నాయి. అయితే, తాను తీసుకునే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని , ఈ విషయంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తామఃన్నారు.



.webp)


