Latest News
యూఎస్‌పై మంచు తుపాను పంజా... 8 వేల విమాన సర్వీసులు రద్దు
posted on: Jan 25, 2026 9:56AM

యూఎస్‌ను భారీ మంచు తుపాను అతలాకుతలం చేసింది. దాని ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీస్థాయిలో మంచు, వర్షంతో పాటు కనిష్ఠ ఉష్ణోగగ్రతులు నమోదవుతున్నాయి. ఈ భీకర తుపాను కారణంగా పలు రాష్ట్రాల్లో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలిగింది. శనివారం నాటి 3,200 విమానసర్వీసులు, ఆదివారం తిరగాల్సిన 4,800 సర్వీసులు రద్దైనట్లు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌అవేర్ వెల్లడించింది.
ఈ పరిస్థితి మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉండటంతో పెద్దసంఖ్యలో రవాణా సర్వీసులకు అంతరాయం కలగొచ్చని అంచనా వేస్తున్నారు. మంచు తుపాను అమెరికాలోని 20 కోట్ల మందికి పైగా ప్రజలపై ప్రభావం చూపనుందని అధికారులు వెల్లడించారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. దాతో కెంటకీ, వర్జీనియా, కాన్సస్, అర్కాన్సాస్, జార్జియా, మిసిసిపి సహా పలు రాష్ట్రాలు ఎమర్జెన్సీ విధించాయి.
మిసిసిపి, ఫ్లోరిడా వంటి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రమాదకర చలి వాతావరణం ఉంటుందని, మిస్సోరి ఇల్లినోయీలల్లో భారీ మంచు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రతికూల వాతావరణం కారణంగా అనేక ప్రాంతాల్లో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడనుందని, వాహనదారులు మంచులో చిక్కుకుపోయే ప్రమాదం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరికలు జారీ చేశారు. ఇది ఈ దశాబ్దంలోనే అతి తీవ్రమైన తుపాను అంటున్నారు.


.webp)



