ట్రెండింగ్ టాపిక్: "డియర్" స్మృతీ

posted on: Jun 16, 2016 6:41PM

కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి స్మృతీ ఇరానీని ఉద్దేశిస్తూ బీహార్ విద్యాశాఖ మంత్రి డియర్ అన్న పదంతో సంబోధించడం రాజకీయవర్గాల్లో చర్చకు దారి తీసింది. బీహార్‌కు సంబంధించిన కొత్త విద్యా విధానాన్ని ఎప్పుడు తీసుకొస్తారంటూ ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అశోక్ చౌదరి ట్వీట్ చేశారు. దానిలో డియర్ స్మృతీ ఇరానీజీ...మాకు కొత్త విద్యా విధానాన్ని మాకు ఎప్పుడు తీసుకొస్తారు? మీ క్యాలెండర్లో 2015 ఇంకా పూర్తి కాలేదా..? అని చౌదరి వ్యాఖ్యానించారు. అయితే, దీనిపై ఇరానీ మండిపడ్డారు. అశోక్‌జీ మహిళలను డియర్ అని సంబోధించడం ఎప్పటి నుంచి మొదలుపెట్టారు..? అని నిలదీశారు.

 

దీనికి తిరిగి స్పందించిన చౌదరి మిమ్మల్ని అగౌరవపరచడం నా ఉద్దేశ్యం కాదు..కానీ నేర్పుతున్నాను..అధికారిక లేఖలు డియర్ అన్న పదంతో ప్రారంభమవుతాయి. ఇది మీకు తెలియంది కాదు..అవమానించడమూ కాదు అంటూ ట్వీట్ చేశారు. అయినా మీరు నేనడిగిన ప్రశ్నకు సమాధానమివ్వకుండా..డొంక తిరుగుడుగా మాట్లాడతారేంటి? అని పేర్కొన్నారు. ఇక అక్కడి నుంచి ఇద్దరి మంత్రుల మధ్య ట్విట్టర్‌లో మాటల యుద్ధం సాగుతోంది. ఇంకో విషయం ఎంటంటే వీరిద్దరి మద్ధతుదారులు పరస్పరం మాటల దాడి చేసుకుంటున్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...