స్లో ఓవర్ రేట్.. పంజాబ్ కింగ్స్‌కు భారీ పెనాల్టీ

posted on: Apr 4, 2026 3:54PM

ఐపీఎల్ 2026 సీజన్‌లో రెండో విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లకు ఆ ఆనందం లేకుండా పోయింది. చైన్నె సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ శ్రేయ్యస్ అయ్యర్‌‌తో పాటు పంజాబ్ ఆటగాళ్లపై జరిమానా పడింది. అది రెండో సారి కావడంతో శ్రేయస్‌పై ఐపీఎల్ కమిటీ ఏకంగా రూ.24 లక్షల ఫైన్ విధించింది. ప్లేయర్లకు రూ.6లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో పాతిక  శాతం జరిమానా విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ రెండోసారి స్లో ఓవర్‌రేట్ ఎదుర్కొంది. 

గత ఐపీఎల్ సీజన్ ముందు వరకు కెప్టెన్‌పై మూడుసార్లు స్లో ఓవర్ రేట్ తప్పిదాలకు పాల్పడితే ఒక మ్యాచ్ బ్యాన్ ఉండేది. కానీ, గత సీజన్ సమయంలో ఐపీఎల్ కొన్ని నిబంధనలు మార్చింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం మూడోసారి తప్పిదానికి పాల్పడినా ఆ కెప్టెన్‌పై జరిమానా పెరుగుతుంది కాని, ఎలాంటి నిషేధం ఉండదు. అంటే మూడో సారి శ్రేయస్ అయ్యర్ ఇదే తప్పిదం చేస్తే ఆ జరిమానా రూ.36లు అవుతుంది. ప్లేయర్లపై 50 శాతం వరకూ మ్యాచ్ ఫీజులో కోత విధించే అకాశం ఉంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...