Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆహా ఏమి రుచి.. తినరా మైమరచి.. టాప్ 100లో ఆరు ఇండియన్ డిషెస్
posted on: May 9, 2026 2:59PM

ప్రపంచవ్యాప్తంగా ఆహార ప్రియుల నాలుకలపై భారతీయ రుచులు నాట్యం చేస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ ఫుడ్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ ప్రకటించిన ప్రపంచంలోని టాప్-100 అత్యుత్తమ వంటకాల జాబితాలో భారతీయ ఆహార పదార్థాలు సత్తా చాటాయి. మన దేశానికి చెందిన ఆరు విభిన్నమైన వంటకాలు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో స్థానం సంపాదించుకోవడం గమనార్హం. కేవలం రుచితోనే కాకుండా, భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటిచెప్పే ఈ వంటకాలు ఇప్పుడు ప్రపంచ స్థాయి గుర్తింపును దక్కించుకున్నాయి.
పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అనేది సామెత కానీ భారత వంటకాల రుచి మాత్రం వాళ్లూ, వీళ్లూ అని లేదు అందరికీ నచ్చుతాయి. వంటకాల పేరు వినగానే నోరూరిపోతుంది, వాటి రుచి తలుచుకోగానే. అటువంటి ఆరు భారతీయ వంటకాలు ప్రపంచ టాప్ హండ్రడ్ లో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార నిపుణులు, భోజన ప్రియుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన ర్యాంకింగ్స్ లో ఏకంగా ఆరు ఇండియన్ డిషెస్ టాప్ 100లో చోటు దక్కించుకున్నాయి. హైదరాబాద్ బిర్యానీ, బటర్ చికెన్, చికెన్ 65, కిమా, బటర్ గ్లారిక్ నాన్ ఉన్నాయి. ఈ అరుదైన గుర్తింపు పట్ల దేశీయ ఆహార రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ డిషెస్ కు విదేశాలలో సైతం పెరుగుతున్న ఆదరణ పర్యాటక రంగానికి కూడా మేలు చేస్తుందంటున్నారు. గతంలో కంటే ఇప్పుడు విదేశీయులు భారత సంప్రదాయ వంటకాలపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని తేలింది.
అంతర్జాతీయ స్థాయిలో లభించిన ఈ గుర్తింపు ఇండియన్ హోటల్ ఇండస్ట్రీ మరింత పుంజుకోవడానికి దోహదపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. భారత వంటకాల్లో ఉపయోగించే మసాలాలు, మూలికల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్న తరుణంలో ఈ ర్యాంకింగ్స్ ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. రానున్న రోజులలో మరిన్ని ఇండియన్ డిషెస్ ఈ జాబితాలో చేరే అవకాశం ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. దక్షిణాదికి చెందిన దోశ, ఇడ్లీ వంటి అల్పాహారాలు కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో, భవిష్యత్తులో ఇండియన్ ఫుడ్ ఇండస్ట్రీ ప్రపంచాన్ని శాసించనుందని అంటున్నారు.


.webp)
.webp)


