Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీని విచారించిన సీట్.!
posted on: Jul 14, 2026 12:42PM
.webp)
తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, ఉన్నతాధికారులు, పోలీసు అధికారుల వాంగ్మూలాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ సీనియర్ మాజీ ఐపీఎస్ అధికారిని విచారించింది.
ఆంధ్రప్ర దేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సిట్ అధికారులు విచారణ కు పిలిచి ఆయన వాంగ్మూలం రికార్డు చేశారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ఇతర రాష్ట్రానికి చెందిన సీనియర్ బ్యూరోక్రాట్‌ను విచారించ డం ఇదే తొలిసారి.
సిట్ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ప్రాథమిక వివరాల ప్రకారం... 2023లో దాదాపు ఏడాది పాటు ఏబీ వెంకటేశ్వరరావు కాల్ డేటా రికార్డులను నిందితులు అక్రమంగా సేకరించినట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆయనను ఈ కేసులో బాధితుడిగా, కీలక సాక్షిగా పరిగణించిన సిట్ వెంకటేశ్వరరావును విచారణకు పిలిచి ఆయన వాంగ్మూలం నమోదు చేశారు.
విచారణ సందర్భం గా ఏబీవీ కాల్ డేటా సేకరణ కు సంబంధించిన అంశాలు, ఆ సమయంలో ఆయన నిర్వహించిన అధికారిక బాధ్యతలు, తదితర అంశాలపై సిట్ అధికారులు ఏబీ వెంకటే శ్వరరావును ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఏబీవీ కాల్ డేటా సేకరణ వెనుక ఉన్న ఉద్దేశం, దాన్ని ఎవరెవరు ఉపయోగిం చారు, ఏ విధంగా దుర్విని యోగం చేశారనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
SIT, Former AP Intelligence Chief ABV in the phone-tapping case, telangana Phone Tapping Case






