సీఐ నాగరాజును కోర్టులో హాజరు పరిచిన సిట్

posted on: Jun 24, 2026 10:15AM

 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. . ఈ కేసులో   ఆరోపణలు ఎదుర్కొంటున్న  సీఐ నాగరాజును పోలీసులు మంగళవారం (జూన్ 23) అరెస్టు చేశారు.  అరెస్టు చేసిన నాగరాజును   సుదీర్ఘంగా విచారించారు.  సాయి కృష్ణ మిస్సింగ్  మిస్టరీని ఛేదించేందుకు..  ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్    నాగరాజు ఈ కేసులో నాగరాజు పాత్ర ఉందా? అన్న కోణంలో విచారిస్తున్నారు.  మంగళవారం మధ్యాహ్నం మొదలైన నాగరాజు విచారణ దాదాపు రాత్రి అంతా సాగినట్లు తెలుస్తోంది. 

గురువారం (జూన్ 24) ఉదయం నాగరాజును న్యాయస్థానంలో హాజరు పరిచారు. అంతకు ముందు సిట్ అధికారులు నాగరాజుకు  వైద్య పరీక్షలు  నిర్వహించారు.  సాయి కృష్ణ మిస్టరీ మిస్సింగ్ కేసులో ఇప్పటికే పలువురు సాక్షులను విచారించిన సిట్, ఇప్పుడు సీఐ నాగరాజువిచారణలో  పక్కా ఆధారాలను సేకరించినట్లు సమాచారం.  

google-ad-img
    Related Sigment News
    • Loading...