మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు
posted on: Jan 26, 2026 5:53PM

ఫోన్ ట్యాఫింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పీఎస్‌లో విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. CRPC 160 క్రింద సిట్ సంతోష్ రావుకు నోటీసులిచ్చింది. ఈ కేసులో ఇటీవల బీఆర్‌ఎస్ నేతలు హారీశ్‌రావు, కేటీఆర్‌లను సిట్ విచారించిన సంగతి తెలిసిందే.
ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాఫ్తు సంస్థను ప్రశ్నించింది. ఇప్పటికే రెండు వారాల కస్టడీకి అనుమతించామని, ఇంకెంత కాలం విచారణ కొనసాగిస్తారని ప్రశ్నించింది. ప్రభాకర్ రావు విచారణను త్వరగా పూర్తి చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ వేగవంతం చేసింది.






