సిట్ నోటీసులపై కేసీఆర్ కీలక ప్రకటన

posted on: Jan 29, 2026 7:51PM

 

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ జారీ చేసిన నోటీసులకు మాజీ సీఎం కేసీఆర్ బదులిచ్చారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజు దృష్ట్యా సిట్ విచారణకు రేపు హాజరుకాలేని కేసీఆర్ తెలిపారు. మరో తేదీన తనను ఎర్రవల్లిలోనే విచారించాలని సిట్ అధికారులను కోరారు. ఎర్రవల్లి నివాసానికే వచ్చి విచారణ చేయాలని తెలిపారు. భవిష్యత్తులో అన్ని నోటీసులు ఫామ్ హౌస్‌  అడ్రస్‌కే పంపాలని విజ్ఞప్తి చేశారు. 

మాజీ ముఖ్యమంత్రిగా, బాధ్యత గల పౌరుడిగా  విచారణకు సహకరిస్తానని తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విషయంలోనూ గులాబీ బాస్ ఇదే తరహాలో వ్యవహరించారు. 2025 జూన్‌లో విచారణకు రావాల్సిందిగా కేసీఆర్‌కు  కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై  కమిషన్ నోటీసులు ఇచ్చింది. అయితే కొన్ని పనుల వల్ల జూన్ 11 వరకూ సమయం కావాలని బీఆర్‌ఎస్ అధినేత కోరగా అందుకు కమిషన్ సైతం అంగీకరించింది. మరోవైపు ఇవాళ ఎమ్మెల్యేలు హారీశ్ రావు, కేటీఆర్‌తో మాజీ సీఎం భేటీ అయ్యారు.


 

google-ad-img
    Related Sigment News
    • Loading...