Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఫోన్ ట్యాపింగ్ కేసులో తీగల కృష్ణారెడ్డికి సిట్ నోటీసులు
posted on: Jun 4, 2026 11:02AM
.webp)
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ బీజేపీ నేత లంకల దీపక్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి నోటీసులు జారీ చేసింది. లంకల దీపక్ రెడ్డిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో హాజరుకావాలని సిట్ ఆ నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో ఆయనను నిందితుడిగా కాకుండా సాక్షిగా విచారించనున్నట్లు సమాచారం. దర్యాప్తు బృందం ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసి, కేసుకు సంబంధించిన కొన్ని అంశాలపై వివరాలు సేకరించే అవకాశం ఉంది.
అలాగే.. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి కూడా నోటీసులు జారీ చేసి, విచారణకు హాజరుకావా లని సూచించింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి వస్తున్న కొత్త విషయాల నేపథ్యంలో వివిధ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఇతర వ్యక్తుల నుంచి సమాచారం సేకరించే ప్రక్రియలో భాగంగానే ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ కేసులో పలువురు మాజీ పోలీసు అధికారులను సిట్ విచారించిన సంగతి తెలిసిందే. తాజాగా లంకల దీపక్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి వంటి రాజకీయ నాయకులకు నోటీసులు జారీ కావడం కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామంగా భావిస్తున్నారు.


.webp)



