కేసీఆర్‌కు సిట్ మరోసారి నోటీసులు
posted on: Jan 30, 2026 6:39PM
.webp)
ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 1న ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని సిట్ నోటీసుల్లో పేర్కొన్నారు. ఎర్రవెళ్లి ఫామ్ హూస్‌లో విచారించేందుకు సిట్ నిరాకరించింది. హైదరాబాద్‌లో నందినగర్ నివాసంలో విచారిస్తామని వెల్లడించింది. మాజీ సీఎం కేసీఆర్‌కు గురువారం సిట్ నోటీసు ఇచ్చింది. అయితే మున్సిపల్ ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నానని, మరో తేదీ ఇవ్వాలని గులాబీ బాస్ కోరారు. దీనికి సిట్ సానుకూలంగా స్పందించింది.



.webp)


