Latest News
ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేటీఆర్ కు సిట్ నోటీసులు
posted on: Jan 22, 2026 4:05PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలంటూ బీఆర్ఎఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కు సిట్ నోటీసులు జారీ చేసింది. శుక్రవారం (జనవరి 23) ఉదయం 11 గంటలకు జూబ్లీహాల్స్ సిట్ కార్యాలయంలో హాజరు కావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇదే కేసులో రెండు రోజుల కిందట మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావును దాదాపు ఏడున్నర గంటల పాటు విచారించిన సిట్, ఇప్పుడు కేటీఆర్ కు విచారణకు రావలసిందిగా నోటీసులు జారీ చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.



.webp)


