Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు.. సిట్ దర్యాప్తు ముమ్మరం.. సిమ్లాకు దర్యాప్తు బృందం
posted on: Mar 18, 2026 12:45PM
.webp)
మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసింది. డ్రగ్ కొనుగోలు చేసిన ప్రాంతానికి దర్యాప్తు బృందాన్ని పంపింది.ఈ కేసులో కీలకంగా మారిన కౌశిక్ రవి.. డ్రగ్‌ను సిమ్లా నుంచి కొను గోలు చేసినట్లు వెల్లడించి నట్టు సమాచారం. అయితే సిమ్లాలో ఎవరి వద్ద నుండి కౌశిక్ రవి డ్రగ్స్ కొనుగోలు చేశాడన్న దానిపై కూపీ లాగేందుకు దర్యాప్తు బృందం సిమ్లాకు వెళ్ళింది.
సిమ్లా ప్రభుత్వంతో కలిసి ప్రాజె క్టులు నిర్వహిస్తున్న కౌశిక్ రవి, బెంగళూరులో అడ్వకేట్‌గా పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా పైలట్ రోహిత్ రెడ్డితో కౌశిక్ రవికి సన్నిహిత సంబం ధాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదరడంతో కౌశిక్ రవి బెంగళూరులో జరిగే పలు డ్రగ్ పార్టీలకు పైలట్‌ను ఆహ్వానించాడు. అదేవిధంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరులోని ప్రముఖు లతో పైలట్‌కు పరిచయాలు చేసింది కూడా కౌశిక్ రవేనని పోలీసులు గుర్తించారు. పైలట్ రోహిత్ రెడ్డి, కౌశిక్ రవిలు కలిసి బెంగళూరులో డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు పోలీసులు అనుమానిస్తు న్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు బెంగళూరులో జరిగిన డ్రగ్స్ పార్టీలపై ఆరా తీస్తున్నారు.
కాగా డ్రగ్ మాఫియాతో రోహిత్ రెడ్డికి లింకులు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. రోహిత్ డ్రైవర్ శరత్ కు కూడా డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.. అభిషేక్ సింగ్ దగ్గర నుంచి శరత్ పెద్ద మొత్తంలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అభిషేక్ సింగ్ వద్ద నుండి శరత్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. డ్రగ్ మాఫియా కింగ్ పిన్ అభిషేక్ సింగ్ కోసం పోలీ సులు గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో కూడా అభిషేక్ సింగ్ పై డ్రగ్ కేసులు నమోదయ్యాయి. ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో కూడా అభిషేక్ పాత్ర ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు


.webp)



