రెండో దశలో 12 రాష్ట్రాలలో ఎస్ఐఆర్ నిర్వహణ : జ్ఞానేశ్ కుమార్
posted on Oct 27, 2025 6:05PM
.webp)
దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రక్షాళనకు చేపట్టే ప్రత్యేక ముమ్మర సవరణ ఎస్‌ఐఆర్‌పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రెండో విడతగా మరో 12 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతల్లో ఎస్‌ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహించబోతున్నట్లు సీఈసీ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఈ సర్వేలో చనిపోయిన వారు, బదిలీ చేయబడిన వారి ఓటర్లను తొలగిస్తున్నట్లు చెప్పింది. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే కార్యక్రమ ఎస్‌ఐఆర్ లక్ష్యమని వెల్లడించింది.
ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఈ అర్ధరాత్రి నుంచే ఓటర్ల జాబితా సీజ్ చేస్తామని సీఈసీ కీలక ప్రకటన చేసింది. అర్హులైన ప్రతీ ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే కార్యక్రమ ఎస్‌ఐఆర్ లక్ష్యమని వెల్లడించింది. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఈ అర్ధరాత్రి నుంచే ఓటర్ల జాబితా సీజ్ చేస్తామని సీఈసీ కీలక ప్రకటన చేసింది. 1951 నుంచి 2004 వరకు ఎనిమిది సార్లు ఎస్‌ఐఆర్ నిర్వహించగా, 21 ఏళ్ల తర్వాత మళ్లీ విజయవంతంగా పూర్తి చేస్తున్నామని అధికారులు తెలిపారు.
బీహార్‌లో సుమారు 7.5 కోట్ల మంది ఓటర్లతో ఎస్‌ఐఆర్ విజయవంతంగా పూర్తయిందని, ఈ ప్రక్రియపై ఎలాంటి అభ్యంతరాలు రాలేదని ఎన్నికల కమిషన్ పేర్కొంది.ప్రతి ఇంటికి మూడుసార్లు బీఎల్‌ఓ (బూత్ లెవెల్ ఆఫీసర్) విజిట్ చేస్తారు. బీఎల్‌ఓ అందించే ఎన్యుమరేషన్ ఫారంలో కుటుంబ సభ్యుల వివరాలు నమోదు చేసి సంతకం చేయాలని సూచించారు. 2003లో ఎవరితో నివసించామనే లింక్ వివరాలు కూడా ఫారంలో తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ ఫారంలో వివరాల మ్యాచింగ్ మరియు లింకింగ్ కీలకమని పేర్కొన్నారు.
ఎన్యుమరేషన్ ఫారమ్ సమర్పించిన వారినే ఓటర్ జాబితాలో నమోదు చేస్తారని అధికారులు స్పష్టం చేశారు. బూత్ లెవెల్ ఏజెంట్లు 50 ఫారంల వరకు ఎన్నికల సంఘానికి అందజేయవచ్చని తెలిపారు. అన్ని ఫారాలు సేకరించిన తర్వాత ముసాయిదా ఓటర్ జాబితా విడుదల చేస్తామని చెప్పారు.ఈ ప్రక్రియలో భాగంగా ఎస్‌ఐఆర్ నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు కొనసాగుతుంది. డిసెంబర్ 9న ముసాయిదా ఓటర్ జాబితా విడుదల అవుతుంది. డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు అభ్యంతరాల స్వీకరణ, డిసెంబర్ 9 నుంచి జనవరి 31 వరకు హియరింగ్, వెరిఫికేషన్, అనంతరం ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా విడుదల కానుందని సీఈసీ వెల్లడించారు.