Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సిమ్ లేకపోతే వాట్సప్ బంద్
posted on: Feb 28, 2026 5:00AM

వాట్సప్, టెలిగ్రామ్ వంటి కమ్యూనికేషన్ యాప్స్‌కు సంబంధించి సిమ్ బైండింగ్ నిబంధనలు ఆదివారం (మార్చి1) నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే సిమ్ లేకుండా ఇకపై ఆయా యాప్స్ ఫోన్‌లో పనిచేయవు. గతే ఏడాది నవంబరులో ఈ కొత్త రూల్స్ ప్రకటించగా, అమలు కోసం ఆయా సంస్థలకు ఇచ్చిన గడువు ఈ నెల 28తో ముగియనుంది. అంటే మరికొన్ని గంటల్లో కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ఎవరైనా సిమ్ లేకుండా వాట్సప్ వాడుతుంటే ఆ ఫోన్లలో యాప్ నిలిచపోతుందన్న మాట. వాట్సప్ వెబ్ కూడా ప్రతి ఆరుగంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్ అయిపోతుంది. వాట్సప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై వంటి కమ్యునికేషన్ యాప్స్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి కేంద్రం ఈ నిబంధన తీసుకొచ్చింది.
ఈ యాప్స్‌కు సిమ్ కార్డు బైండింగ్‌ను తప్పనిసరి చేస్తూ టెలికం విభాగం.. ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం యాప్ ఇన్‌స్టలేషన్ సమయంలోనే సిమ్‌కార్డును ధృవీకరించుకుంటున్నారు. ఆ తర్వాత డివైజ్ నుంచి సిమ్ కార్డును తొలగించినా, డీయాక్టివేట్ చేసినా సేవలు మాత్రం కొనసాగుతున్నాయి. దాంతో ఇతర దేశాల్లోని సైబర్ నేరగాళ్లు యాప్స్‌ను వినియోగించుకోవడం సాధ్యమవుతోంది. సిమ్ బైటింగ్ నిబంధన వల్ల మోసపూరిత కార్యాకలాపాలు తగ్గుతాయని సైబర్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సిమ్ బైండింగ్ రూల్స్ అమలుకు సంబంధించిన గడువు పొడిగించేది లేదని కేంద్ర మంత్రి జోతిరాదిత్య సింధియా ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో మార్చ్ ఒకటి నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.


.webp)
.webp)


