అల్లుడికి వెండి చెప్పులు కానుక

posted on: May 21, 2026 12:40PM

ఓ మామ తన అల్లుడికి వెండి చెప్పులు కానుకగా ఇచ్చారు. ఇందు కోసం ఆయన ఏకంగా నాలుగు లక్షల రూపాయలకు పైగా వెచ్చించాడు. దాదాపు కిలోన్నర వెండితో కొల్హాపురి చెప్పులను తయారు చేయించి మరీ తన అల్లుడికి కానుకగా ఇచ్చారు.

 కొల్హాపుర్ కు చెందిన ప్రముఖ చర్మకారుడు విక్రాంత్ మాలి దాదాపు ఎనిమిది రోజులు శ్రమించి ఈ ప్రత్యేక చెప్పులను రూపొందించాడు. ప్రస్తుతం వెండి ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. తన అల్లుడి కోసం ప్రత్యేకంగా వెండితో చెప్పులు తయారు చేయించి కానుకగా ఇవ్వడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...