బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ తినే అలవాటు ఉందా.. ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

 


నేటి బిజీ జీవితాలలో బ్రేక్ ఫాస్ట్ అంటే చాలా మంది ఆలోచలో పడిపోతారు.  ఉద్యోగాలకు వెళ్లేవారు పిల్లలను స్కూల్ కు పంపేవారు ఉదయాన్నే టిఫిన్,  మధ్యాహ్నానికి లంచ్ రెండూ తయారు చేయడం అంటే కాస్త కష్టమే.  పైగా తల్లి కూడా ఉద్యగస్తురాలు అయితే ఇక వంట చేయడం దగ్గర చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. చాలా మంది సులువైన పరిష్కారాల వైపు మొగ్గు చూపుతారు. అలాంటి వాటిలో బ్రెడ్ కూడా ఒకటి.  ఉదయాన్నే బ్రెడ్ కు కాస్త జామ్ రాస్ శాండ్విచ్ తయారు చేస్తే ఇంటిల్లిపాదీ ఈజీగా బ్రేక్పాస్ట్ చేసేయవచ్చు. అయితే ఇలా అల్పాహారంగా ప్రతి రోజూ బ్రెడ్ తీసుకోవడం ఎంతవరకు ఆరోగ్యానికి మంచిది అనే విషయం చాలామంది ఆలోచన చేయరు. దీని గురించి షాకింగ్ నిజాలు తెలుసుకుంటే..

బ్రెడ్‌లో ఉండే శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు,  ప్రిజర్వేటివ్‌లు శరీర జీవక్రియను నెమ్మదిగా దెబ్బతీస్తాయి. క్రమం తప్పకుండా బ్రెడ్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.  శరీరంలో వాపు వంటి సమస్యలు కూడా వస్తాయి.

కొంతమంది మద్యం తాగకపోయినా వారి శరీరంలో ఆల్కహాల్ ఏర్పడటం ప్రారంభమవుతుందట. ఇది వింతగా అనిపించవచ్చు, కానీ ఇది ఆటో-బ్రూవరీ సిండ్రోమ్ (ABS) లేదా గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్ అని పిలువబడే చాలా అరుదైన వైద్య పరిస్థితి. ఈ స్థితిల, ఒక వ్యక్తి కడుపు లేదా ప్రేగులలో ఉండే కొన్ని రకాల ఈస్ట్ (ఫంగస్) శరీరంలోకి తీసుకున్న కార్బోహైడ్రేట్‌లను  బ్రెడ్, బియ్యం లేదా స్వీట్లు వంటివి - కిణ్వ ప్రక్రియకు గురిచేసి ఆల్కహాల్‌గా మారుస్తాయి. ఫలితంగా ఒక వ్యక్తి మద్యం తాగకపోయినా, తలతిరగడం, అలసట,  గందరగోళం వంటి మత్తు లక్షణాలు ఏర్పడతాయి. ఈ సమస్యను సకాలంలో గుర్తించకపోతే అది క్రమంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతుందట.

బ్రెడ్ వల్ల  సమస్య ఎందుకు?

బ్రెడ్ తయారీలో ఉపయోగించే శుద్ధి చేసిన పిండి, ప్రిజర్వేటివ్స్,  అధిక సోడియం కంటెంట్ జీర్ణక్రియను బలహీనపరచడమే కాకుండా పేగు ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయి. బ్రెడ్ లో పోషకాలు లోపిస్తాయి, దీని కారణంగా శరీరానికి అవసరమైన పోషకాలు ఏమీ అందవు.

ఎవరు తినకూడదు..

డయాబెటిస్, రక్తపోటు లేదా థైరాయిడ్ తో బాధపడేవారు ముఖ్యంగా బ్రెడ్ తినకుండా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారికి, ఇది క్రమంగా  'స్లో పాయిజన్' లాగా పనిచేస్తుంది.

బ్రెడ్ బదులు ఏం తినవచ్చంటే..

రోజువారీ బ్రెడ్ కు బదులుగా మల్టీగ్రెయిన్ రోటీ, ఓట్స్ ఉప్మా, క్వినోవా, శనగపిండి చీలా లేదా దోశ  లేదా ఇంట్లో తయారుచేసిన ఫ్రూట్ స్మూతీ వంటివి ఎంచుకోవచ్చు. అవి పోషకమైనవి మాత్రమే కాదు, సులభంగా జీర్ణమవుతాయి,  రోజంతా శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి.

                                *రూపశ్రీ.


గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...