Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సిద్ధరామయ్యపై బిగుస్తున్న ‘ముడా’ ఉచ్చు!
posted on: Oct 1, 2024 1:17PM

ముడా కుంభకోణంలో కర్నాటక సీఎం సిద్దరామయ్యకు ఉచ్చు బిగుస్తోంది. కర్ణాటకలోకి సీబీఐ దర్యాప్తును రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడంతో ఈడీ రంగంలోకి దిగింది. ముడా వివాదంలో సిద్ధరామయ్యపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. కాగా, ఇప్పటికే ముడా స్థలం కేటాయింపు కేసులో సిద్ధరామయ్య, ఆయన భార్య, మరో ఇద్దరిపై మైసూరు లోకాయుక్త పోలీసులు శుక్రవారమే కేసు నమోదు చేశారు. సీఎం సిద్ధరామయ్యను ఏ1గా, ఆయన భార్య పార్వతిని ఏ2గా చేర్చారు. తాజాగా సిద్దరామయ్య భార్య మైసూరు అప్‌మార్కెట్ ప్రాంతంలో తనకు కేటాయించిన 14 ప్రత్యామ్నాయ స్థలాలను ప్రభుత్వానికి తిరిగి అప్పగించినట్టు మంగళవారం ఎక్స్ ద్వారా వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీ నేతలు తన కుటుంబాన్ని వివాదాల్లోకి లాగారని ఆవేదన వ్యక్తం చేశారు.






