Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆ నటిని చంపేసిన సోషల్ మీడియా
posted on: May 28, 2017 3:41PM

ఈ మధ్యకాలంలో ప్రముఖులు అనారోగ్యం పాలై ఆసుపత్రిలో జాయిన్ అయ్యారా ఇంకంతే వారి చనిపోయారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇలాగే బాలీవుడ్ ప్రముఖులు కాదర్‌ఖాన్, ఫరీదా జలాల్, దిలీప్ కుమార్ చనిపోయినట్లు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు హల్ చల్ చేశాయి. తాజాగా ప్రముఖ బుల్లితెర నటి శ్వేతా తివారి చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో ఫేక్ న్యూస్ వచ్చింది.
శ్వేతా స్నేహితురాలు, ప్రముఖ నటి సాక్షి తన్వర్ తన ట్విట్టర్ ఖాతాలో స్నేహితురాల్ని కోల్పోయినందుకు బాధగా ఉందంటూ ట్వీట్ చేయడంతో శ్వేత చనిపోయిందని అనుకున్న ప్రముఖులంతా ఆమెకు నివాళులు ఆర్పించడం మొదలుపెట్టారు. కొందరు ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా శ్వేతా భర్త అభినవ్‌కి ఫోన్లు చేసి సంతాపం తెలిపారు. విషయం తెలియని అభినవ్ కంగారుగా షూటింగ్ మధ్యలో ఆపేసి పరుగు పరుగున ఇంటికి పరిగెత్తాడు. ఇంటికి వెళ్లి విషయం చెప్పగానే శ్వేత తెగ నవ్వుకుందట..ఎందుకంటే ఇప్పటికే ఆమెను ఇలాగే మూడుసార్లు చంపేశారట. ఇలాంటి వార్తలకు తాను అలవాటు పడిపోయిందట. అప్పటి వరకు తమ అభిమాన నటి ఇక లేదని తెలిసి దిగ్ర్భాంతికి గురైన శ్వేత అభిమానులు అసలు విషయం తెలిసి సంతోషంలో మునిగిపోయారు.


.jpg)
.jpg)


