Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ట్రంప్ లక్ష్యంగా కాల్పులు.. స్టేజి డ్రామా అంటూ నెటిజనుల డౌట్లు!
posted on: Apr 27, 2026 11:17AM
.webp)
అమెరికాలో పెనుసంచలనం సృష్టించిన కాల్పుల ఘటనపై నెటిజనులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జెడి వెన్స్‌లు పాల్గొన్న ఒక అధికారిక విందు కార్యక్రమంలో అకస్మాత్తుగా కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ప్రదేశంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఒక్కసారిగా అందరినీ ఉలికిపాటుకు గురి చేసింది. ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోనికి తీసుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ కాల్పుల ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ కాల్పుల ఘటనను నెటిజనులు ఒక ప్రణాళిక మేరకు జరిగిన స్టేజ్డ్ డ్రామాగా అభివర్ణిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం, పడిపోతున్న తన ప్రతిష్ఠను పెంచుకోవడం కోసం ఆడిన నాటకంగా నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. కాల్పులు జరిగిన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ కంటే ముందు ఉపాధ్యక్షుడు జెడి వెన్స్‌ను భద్రతా సిబ్బంది అక్కడి నుండి తరలించడం ఏమిటని నిలదీస్తున్నారు. అధ్యక్షుడి భద్రత పట్ల భద్రతా సిబ్బందికి పెద్ద ఆందోళన లేనట్లు కనిపించిందనీ, దీనిని బట్టి ఈ కాల్పుల ఘటన అంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగిందనిపిస్తోందని నెటిజనులు అంటున్నారు. ఇరాన్ యుద్ధం, దేశీయ రాజకీయాల్లో ట్రంప్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికే వ్యూహాత్మకంగా ఈ షూట్ ఔట్ డ్రామాను తెరమీదకి తీసుకువచ్చారని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ కాల్పుల ఘటన ఒక రెజ్లింగ్ మ్యాచ్‌లోని డ్రామా తరహాలో సాగిందన్న విమర్శలు నెట్టింట వెల్లువెత్తుతున్నాయి. ఈ విందు కార్యక్రమానికి ముందే షూటౌట్ జరుగుతుందనే సంకేతాలు వెలువడ్డాయని, ఇది పూర్తిగా ప్లాన్ చేసిన వ్యవహారమనీ కొందరు పోస్టులు పెడుతున్నారు.
ప్రస్తుతం ఈ కాల్పుల ఘటనపై అమెరికా దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. నిందితుడి నేపథ్యం? అతనికి ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా? వ్యక్తిగత కారణాలతో చేసిన దాడా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. అది పక్కన పెడితే.. సామాజిక మాధ్యమంలో వస్తున్న ఈ స్టేజ్డ్ డ్రామా ఆరోపణలు ట్రంప్ రాజకీయ ప్రతిష్టపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమౌతోంది. మొత్తం మీద ఈ కాల్పుల ఘటన ట్రంప్ కు ఇసుమంతైనా సానుభూతి సాధించి పెట్టలేదన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది.



.webp)


